ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో డి.ఐ.జి గా విధులు నిర్వహించిన విశ్రాంత ఐపిఏస్ అధికారి బుధవారం చెన్నూరి ఆంజనేయరెడ్డి ఉండ్రాజవరం బౌద్ధ ధమ్మపీఠం ఆధ్వర్యంలో సందర్శించారు.. ఈ సందర్భంగా నిర్మాణంలో ఉన్న మైత్రేయ బుద్ధ విహార ఆలయాన్ని సందర్శించి మాట్లాడుతూ బుద్ధగయలోని ప్రధాన ఆరామ నమూనాగా నిర్మితమౌతున్న ఈ మైత్రేయ బుద్ధ విహార పూర్తయితే, ఈ విహారను దర్శించడానికి భారతదేశం నలుమూలల నుండేకాక విదేశాలనుండి కూడా యాత్రికులు సదర్శిస్తారని, ఈ నిర్మాణం ఉభయగోదావారి జిల్లాలలకే కాక యావత్ ఆంధ్రప్రదేశ్‌కే తలమానికం మౌతుందని అన్నారు. ఈ విహార నిర్మాణానికి అందరూ సహకరించాలని, తన వంతుగా 5లక్షల రూపాయలు విరాళాన్ని ప్రకటించారు. యువతను సన్మార్గంలో నడపడానికి, ఒత్తిడిని జయించడానికి గౌతమబుద్దుని బోధనలు, బౌద్ధ ధ్యానప్రక్రియలు ఎంతో ఉపకరిస్తాయని అన్నారు.
ఈ కార్యక్రమంలో బూరుగుపల్లి కళారావు, నెక్ చైర్మెన్ మల్లిన శ్రీనివాస్, కె.లక్ష్మినారాయణ పాల్గొన్నారు.
