తణుకు మండలం కొమరవరం గ్రామంలో బుధవారం దళిత ఐక్యవేదిక ఆధ్వర్యంలో దళిత ఐక్యవేదిక సభా కార్యక్రమం జరిగింది.ఈ సమావేశంలో ముఖ్యఅతిథి దళిత ఐక్యవేదిక నియోజకవర్గ అధ్యక్షులు న్యాయవాది పొట్ల సురేష్, సెక్రెటరీ పి. రాజేష్, తణుకు మండలం అధ్యక్షులు నక్క రమేష్ సభాధ్యక్షులు మద్దిపాటి ఏసు, ఉద్యోగ సంఘాల నాయకుడు జి.మధు సురేష్ మాట్లాడుతూ దళితుల మీద దాడులు జరిగితే ఊరుకునే రోజులు పోయాయి దాడికి ప్రతి దాడిచేసే విధంగా యువత ముందుకు రావాలని ప్రజా పోరాటాలకు సిద్ధం కావాలని అంబేద్కర్ కన్న కలలు నెరవేర్చే విధంగా యువత ముందుకు రావాలని కోరారు. అదేవిధంగా గ్రామకమిటీలు పూర్తిచేసి రానున్న రోజుల్లో తణుకు నియోజకవర్గంలో చరిత్రను సృష్టించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కార్యవర్గసభ్యులు కాకి రత్నరాజు కొమరవరం అంబేథ్కర్ యూత్ గ్రామస్తులు, మహిళలు, పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొమరవరం దళిత ఐక్యవేదిక గ్రామ కమిటీని నియమించడం జరిగింది గ్రామకమిటీ అధ్యక్షులు భావన దొరబాబు ఉపాధ్యక్షులు బొంత సుకుమార్, గల్లి శివ రవితేజ తదితరులను గ్రామ కమిటీగా ప్రకటించారు. ఈ కార్యక్రమంలో కొమరవరం అంబేద్కర్ సభ్యులు దళిత ఐక్య సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
