అత్తిలిలో మహిళల న్యాయ విజ్ఞాన సదస్సు

మండల ప్రజాపరిషత్ కార్యాలయం కాన్ఫరెన్స్ హాలు, అత్తిలి మహిళా న్యాయ విజ్ఞాన సదస్సు, జాతీయ మహిళా కమిషన్ మరియు జాతీయ న్యాయసేవాధికార సంస్థ వారి ఆదేశము మేరకు తణుకు చైర్మన్ మరియు నాలుగవ అదనపు జిల్లా జడ్జి డి.సత్యవతి, ఇతర న్యాయమూర్తులు, బార్ అసోసియేషన్ సభ్యులతో అంగన్వాడి, ఆశ, డ్వాక్రా మహిళలకు మహిళా చట్టాలపై అవగాహన కల్పిస్తూ మొదటగా మహిళలు చదువుకోవాలని తెలిపారు. అన్యాయానికి గురైన మహిళలు ఎలా న్యాయం పొందాలో కొన్ని చట్టాలను తెలియచేస్తూ వివరించారు, కేవలం చట్టాలపై అవగాహన లేకపోవుట వలన అన్యాయానికి గురవుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమ రిసోర్స్ పర్సన్ లు కౌరు వెంకటేశ్వర్లు, కోలా దుర్గభవాని గృహహింస, వరకట్న వేధింపులు, మహిళల పట్ల క్రూరత్వం, లైంగిక వేదింపులు, అపహరణ, యాసిడ్ దాడులు, మానవ అక్రమ రవాణా, గురించి తెలియ చేసారు, ఉచిత న్యాయ సహాయం, సలహా కోసం జాతీయ న్యాయ సేవల సంస్థ టోల్ ఫ్రీ నెంబర్ 15100 కు ఫోన్ చేసి సహాయం పొందవచ్చని తెలిపారు. కోర్టులు పనిచేయు అన్ని చోట్ల న్యాయ సేవల కమిటీ లు ఉన్నాయి అని దానిలో ఉచిత న్యాయసలహా, సహాయం అందిస్తారని, ఆర్థిక స్తోమత పరిశీలించి ఉచిత న్యాయ వాదిని ఏర్పాటు చేస్తారని, అవసరమైన వారికి సలహాలు ఇస్తారని తెలిపారు. ఈ కార్యక్రమములో న్యాయమూర్తులు చైర్మన్ మరియు నాలుగవ అదనపు జిల్లా జడ్జి డి.సత్యవతి, ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి పొతర్లంక సాయిరాం, స్పెషల్ మెజిస్ట్రేట్ PSP చిరంజీవిరావు, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సూరంపూడి కామేష్, CDPO ప్రమోదీని కుమారి, తహసీల్దార్ అత్తిలి వంశీ, MPDO P.శామ్యూల్, అత్తిలి సబ్ ఇన్స్పెక్టర్ ప్రేమ్ రాజ్, రిసోర్స్ పర్సన్ లు కౌర్ వెంకటేశ్వర్లు, కోలా దుర్గ భవాని, తణుకు కోర్టు న్యాయవాదులు ముప్పిడి సుబ్బయ్య, తిర్రే సత్యనారాయణ రాజు, టి.బాలరాజు, కామన మునిస్వామి, మహిళా న్యాయవాదులు శ్రీమతి పోణంగి శ్రావణి సమీరా, కుమారి SK మోతి, అంగన్వాడి సూపర్వైజర్ లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top