మానవ అక్రమరవాణ నిర్మూలన మన అందరి బాధ్యత

మనుషుల అక్రమ రవాణా నిర్మూలన తో ప్రజలు అందరూ బాగసౌమ్యం అయినపుడే దీనిని సమూలంగా నివారిచవచ్చు అని ఉండ్రాజవరం మండలం విద్యాధికారి సక్సేన రాజు అన్నారు. మండలంలో సోమవారం ప్రజ్వల స్వచ్ఛంద రాజమండ్రి జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఎంవియన్ జిల్లాపరిషత్ ఉన్నతపాఠశాల ఉండ్రాజవరం ప్రధానోపాధ్యాయులు మాణిక్యాల రావు, ప్రజ్వల ప్రాజెక్ట్ మేనేజర్ బలరామ కృష్ణ తదితరుల సమక్షంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో” మండల విద్యాధికారి సక్సేనారాజ్ మాట్లాడుతూ మనుషుల అక్రమ రవాణా నిర్ములనలో ప్రజలు అందరు భాగస్వామ్యం అయినప్పుడే దీనిని సమూలంగా నివారించవచ్చు అన్నారు. మానవ అక్రమ రవాణా అనేది ప్రపంచ వ్యాప్తంగా అత్యంత వేగంగా విస్తరి స్తూ ఎంతో మంది అమ్మాయిల జీవితాలను నాశనం చేస్తున్న నేరపూరితమైన చర్య అన్నారు. దీనికి పేద మధ్య తరగతి అమ్మాయిలు, మహిళల: ఎక్కువ గా గురి అవుతున్నారని, ఉద్యోగం, ప్రేమ పెళ్లి పేరుతో మోసంచేసి ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారని. ముఖ్యంగా యుక్త వయసు బాలికలు ఎక్కువ మొత్తం లో మోసపోతున్నారు కాబట్టి వారితో ఎక్కువ సమయం గడిపే ఉపాధ్యాయులు వారిని గమనిస్తూ అవగాహనా కల్పించాలని సూచించారు. అలాగే అబ్బాయిలు కూడా డ్రగ్స్ బారినపడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ప్రతి ఉపాద్యాయుడు పిల్లల ప్రవర్తనను గమనించి తగిన సూచనల, సలహాలు ఇవ్వాలని, అవసరం అయితే తల్లి తండ్రులను పిలిచి మాట్లాడాలని సూచించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెడ్ మాస్టర్ ఎంతో మాట్లాడుతూ ఆన్లైన్ %% ఆఫ్ లైన్ (సైబర్ ట్రాఫికింగ్) అనేది చాలా వేగంగా విస్తరిస్తున్న జటిలమైన సమస్య కాబట్టి పిల్లలకు ఫోన్ ఉపయోగించడం ద్వారా వచ్చే నష్టాలను తెలియజేయాలి అని అన్నారు. సోషల్ మీడియా. ఫ్లాట్ ఫామ్స్ ద్వారా, లోన్స్ అప్స్ ద్వారా, పేన్ బుక్, వాట్సాప్, స్నాప్ చార్ట్ ద్వారా బ్లాక్ మెయిల్ చేయడం, డబ్బులు డిమాండ్ చేయడం చేస్తున్నారు. ముక్యంగా పిల్లలు ఫోన్ వాడడం ద్వారా వచ్చే నష్టాలను తెలియజేయాలి. అన్నారు. ఉపాధ్యాయులు సమాజాన్ని మార్చగలి శక్తి ఉన్న ఒక సమూహం కాబట్టి పిల్లలను మంచి దారిలో వెళ్లేలాగా జీవితంపై, ఆవగాహనా కల్పించాలని సూచించారు. ప్రజ్వుల సినియర్ ప్రాజెక్ట్ మేనెజర్ బలరామకృష్ణ మాట్లాడతూ మానవ ఆక్రమరవాణాను ఆదిలోనే అడ్డుకుంటే మన ఆడపిల్లలను రక్షించుకోవచ్చు.. ఇది అత్యంత వేగంగా విస్తరిస్తున్న సామాజిక సమస్య ప్రతి రోజు మంది అమ్మాయిలు మహిళలు దీని బారిన పడుతున్నారు. ప్రతిఒక్కరు దీనిపై అవగాహనా పెంచుకొని అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రతి టీవర్ తను పరిధిలోని విద్యార్థులకి అక్రమ రవాణా పై అవగాహన కల్పించారు. ఏదైనా సమస్యలు ఉంటే సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఇది మానవతా దృక్పదంతో చేయాలనీ, దీని వలన చాలా మంది అమ్మాయిలు రక్షింప బడతారు అని అన్నారు. మానవ అక్రమ రవాణా నిర్ములన కొరకు ప్ర్వుల సంస్థ గత 28 సంవత్సరాలనుండి లైంగిక వ్యాపారం వ్యతిరేకంగా పనిచేస్తు 28,700 మంది అమ్మాయిలను కాపాడి పునరావాసం కల్పించడం జరిగింది అన్నారు. ఈ సంస్థ వ్యవస్థాపకురాలు పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ సునీత కృష్ణన్ సంబంధిత పోలీస్, జ్యుడీషియల్ ఎడ్యుకేషన్ డిపార్టుమెంటు ల సహకారంతో పనిచేయడం జరుగుతుందన్నారు. ఈస్ట్ గోదావరి జిల్లాలో అన్ని మండలాల పరిధి లోని టీచర్s శిక్షణ ఇచ్చి వారి ద్వారా పాఠశాలలో అవగాహనా కార్యక్రమాలను చేస్తూ ఏదైనా సమస్యలు ఉంటే సంబంధిన అధికారులను ఎలా సంప్రదించలో ఈ శిక్షణలో నేర్చకోవడం జరుగుతుందన్నారు. శిక్షణలో భాగంగా మానవ అక్రమరవాణా ఎలా జరుగుతుంది, ఎవరు దీనికి గురి అవుతారు. లైంగిక వ్యాపారంలోకి వెళ్లిన అమ్మాయిల పరిసితులు త ఎలావుంటాయి సైబర్ ట్రాఫికింగ్ ఆన్లైన్ మోసాలు వివవరిస్తూ ప్రతీ పాఠశాలలో విద్యార్థి జాగృతి సంఘాలను ఏర్పాటు చేసి, వారి ద్వారా అక్రమరవాణా సమాచారాన్ని సంబంధిత అధికారులకు అందించాలని ప్రతి ఒక్కరూ ఈ విషయాల పట్ల అప్రమతంగా ఉండాలని అన్నారు. సమస్యలు ఎదురైనపుడు 1098, చైల్డ్ హెల్ప్ లైన్), 100 పోలీస్) 1930 (సైబర్ ట్రాఫికింగ్) 181 (మహిళా హెల్ప్ డైన్ గురించి, లఘు చిత్రాలను ప్రదర్శించి వివరించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో ప్రజల కోఆర్డినేటర్ శ్రావ్య, సిబ్బంధి అనిల్ కుమార్, సుప్రియ కేశవ్ మరియు ఉంద్రజవారం మండలం నుండి టీచర్స్ పాల్గొన్నారు.

Scroll to Top