ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో గంజాయి- డ్రగ్స్ రహిత తణుకు లక్ష్యంగా అవగాహన

ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో గంజాయి, డ్రగ్స్ రహిత తణుకు లక్ష్యంగా అవగాహనా కార్యక్రమాలు
గంజాయి, డ్రగ్స్ రహిత తణుకులో భాగంగా ప్రోహిబిషన్ మరియు ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో తణుకు పట్టణములో శ్రీ సాయి జూనియర్ కళాశాలలో గంజాయి, ఇతర మాదకద్రవ్యాల నియంత్రణ పై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో గంజాయి మరియు ఇతర మాదకద్రవ్యాలు వలన మానవుల ఆరోగ్యం మరియు మానసిక స్థితిపై కలిగే కలిగే చెడు ప్రభావాలు మరియు సమాజంపై అవి ఎటువంటి దుష్ప్రభావాలు కలిగిస్తున్నాయి, డ్రగ్స్ వ్యసనం ఏ విధంగా అలవడుతుంది, వాటి నుండి బయట పడాలంటే ఏమి చేయాలి, ఏ రకముల చికిత్సలు ఉన్నాయి మరియు డ్రగ్స్ నివారణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు మరియు తీసుకొచ్చిన చట్టాలు తదితర అంశంపై విద్యార్థులకు అవగాహన కలిగించడంతోపాటు వారి యొక్క సందేహాలను నివృత్తి చేయడం కూడా జరిగింది. ఈకార్యక్రమం గంజాయి మరియు డ్రగ్స్ రహిత తణుకు దిశగా విద్యార్థుల నుండి ప్రతిజ్ఞ తీసుకోవడంతో ముగిసింది.ఈ కార్యక్రమంలో తణుకు ప్రోహిబిషన్ మరియు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఎస్ మణికంఠ రెడ్డి మరియు సబ్ ఇన్స్పెక్టర్ ఆర్.మధుబాబు,హెడ్ కానిస్టేబుల్ కె.శ్రీనివాను, కానిస్టేబుల్ జి.ఫణి భూషణ్ మరియు శ్రీ సాయి జూనియర్ కళాశాల చైర్మన్ జి .సత్యనారాయణ, ప్రిన్సిపల్ జి.అవినాష్, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా తణుకు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఎస్. మణికంఠ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు గంజాయి, ఇతర మాదకద్రవ్యాల దుర్వ్యసనాలకు గురికాకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ఇటువంటి అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని, అన్ని విద్యాసంస్థల్లోను ప్రిన్సిపాల్ అధ్యక్షతన , సీనియర్ ఫ్యాకల్టీ, మరియు విద్యార్థులతో కలిపి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో యాంటీ డ్రగ్ కమిటీ లను ఏర్పాటు చేస్తున్నామని ఇన్స్పెక్టర్ ఎస్. మణికంఠ రెడ్డి తెలిపారు.

Scroll to Top