ర్యాష్ డ్రైవింగ్(Rash Driving) చేస్తే కఠిన చర్యలు తప్పవు – తాడేపల్లిగూడెం డీఎస్పీ డి.ఎస్.పి డి విశ్వనాధ్. తణుకు టౌన్ లోని ప్రధాన రహదారిని పరిశీలించి వాహన రద్దీ, రాకపోకలను గమనించిన తాడేపల్లిగూడెం డి.ఎస్.పి డి విశ్వనాధ్. వాహన రద్దీ క్రమబద్ధీకరణ, అతివేగం నియంత్రణ, ర్యాష్ డ్రైవింగ్(Rash Driving), స్నేక్ డ్రైవింగ్(Snake Driving) అరికట్టుట మొదలగు అంశాలకు సంబంధించి సంబంధిత పోలీస్ అధికారులతో కలిసి పరిశీలించిన తాడేపల్లిగూడెం డిఎస్పి డి విశ్వనాథ్. ఇటీవల కాలంలో యువత వాహనాలను గాల్లో నడుపుతూ ఇతర వాహనదారులను భయబ్రాంతులకు గురిచేస్తూ, ప్రమాదాలకు కారణమవుతున్నారు. అటువంటి వారిని గుర్తించి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుని,వారికి అడ్డుకట్ట వేయడానికి తగిన ప్రణాళికలు రూపొందించే పనిలో భాగంగా ఈ పరిశీలన జరిగినది. తాడేపల్లిగూడెం డిఎస్పి డి విశ్వనాథ్ మాట్లాడుతూ వాహనదారులు ఎవరైనా మద్యం తాగి వాహనాలు నడిపడం, అతివేగంతో ప్రయాణించడం, ర్యాష్ డ్రైవింగ్ – స్నేక్ డ్రైవింగ్ వంటివి చేస్తే చట్టపరంగా అరెస్టు చేసి కోర్టుకు పంపడం జరుగుతుందని ఈ సందర్భంగా డి.ఎస్.పి గారు హెచ్చరించారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిని గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి నగరంలో ప్రధాన కూడళ్లు, రద్దీ ప్రదేశాలు, ముఖ్యమైన ప్రదేశాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగినది. వీటితో పాటు విధుల్లో ఉండే ట్రాఫిక్ సిబ్బంది వద్ద కూడా బాడీవోర్న్(Body Worn) కెమెరాలు ఉంటాయని తెలిపారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బృందాలతో ఆకస్మిక వాహన తనిఖీలు కూడా నిర్వహించడం జరుగుతుంది.ఆకతాయిల ఆటలకు అడ్డుకట్ట వేసి, వారికి తీవ్రస్థాయిలో తగిన గుణపాఠం చెప్తామని తెలిపారు. తల్లిదండ్రులు, తమ పిల్లలు వాహనాలను ఏవిధంగా నడుపుతున్నారో పరిశీలించుకుని, వారికి వాహనాల చోదకం పట్ల సరైన సూచనలు ఇవ్వాలని సూచించారు.మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులను బాధ్యులను చేయవలసి వస్తుందనీ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డి.ఎస్పీ తో పాటు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎన్ కొండయ్య, సబ్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్, ట్రాఫిక్ ఎస్సై ఆదినారాయణ, మరియు బెన్ని రాజు, (ట్రాఫిక్), పాల్గొన్నారు.