మూడవ ప్రపంచ యుద్ధం మన కొద్దు

దేశాలు ఆధ్యాత్మిక చింతన చేయడం ద్వారా యుద్ధాలు నివారించ వచ్చునని స్థానిక మల్లిన వెంకట నరసమ్మ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె.యస్.కె. మాణిక్యాలరావు వివరించారు. శనివారం ఉండ్రాజవరం శాఖా గ్రంథాలయంలో గ్రంధాలయాధికారి గుత్తికొండ కృష్ణారావు, శ్రీమతి స్రవంతి ఆధ్వర్యంలో “మూడవ ప్రపంచ యుద్ధం” పై చర్చా వేదిక జరిగింది.
తొలుత గ్రంధాలయ అభివృద్ధి కమిటీ సభ్యులు ఆకెళ్ళ శ్రీనివాసరావు స్వాగతం పలికారు. సభకు రిటైర్డు ఆంగ్ల భాష అధ్యాపకులు కోట రామ ప్రసాద్ అధ్యక్షత వహించారు. కోట రామ ప్రసాద్ మాట్లాడుతూ ప్రపంచం ఇప్పటికే రెండు ప్రపంచ యుద్ధాలు చవి చూసిందని, మూడవ ప్రపంచ యుద్ధం వల్ల విశాసనం సంభవిస్తుందని పేర్కొన్నారు. ఏ.పి.టి.ఎఫ్. రాష్ట్ర పూర్వ కార్యదర్శి అయినపర్తి రాజ గోపాల్ మాట్లాడుతూ భారతదేశం ఎప్పుడూ శాంతిని కోరుకుంటుందని చెప్పారు. సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు, యూ.టీ.ఎఫ్. జిల్లా సహాధ్యక్షులు ఐ.రాంబాబు మాట్లాడుతూ ప్రపంచ యుద్ధాలు మానవాళి వినాశనానికి దారితీస్తాయని వివరించారు. స్థానిక సుంకవల్లి ఇంగ్లీష్ మీడియం పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీమతి ఎల్.దేవి మాట్లాడుతూ, ఐక్యరాజ్య సమితిలో భారత దేశం శాంతిని కోరాలని చెప్పారు. రిటైర్డు ఆంగ్ల భాష ఉపాధ్యాయులు జి. వెంకటేశ్వర రావు మాట్లాడుతూ, ప్రజలు యుద్ధ భయంతో జీవించారాదని పిలుపు నిచ్చారు. స్థానిక మహతి ఇంగ్లీష్ మీడియం స్కూల్ కరస్పాండెంట్ ఐ.జగదీష్ మాట్లాడుతూ, రష్యా, ఉక్రెయిన్ దేశాల సరసన అగ్రరాజ్యాలు యుద్ధానికి కాలు దువ్వుతున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సింహాద్రి రామ చంద్రరావు, K.V. కృష్ణారావు. పి.ప్రకాశరావు, పాఠకులు పాల్గొన్నారు.

Scroll to Top