తణుకు మండలం దువ్వ గ్రామంలో ఉన్నటువంటి శ్రీ దానేశ్వరి అమ్మవారి ఆలయంలో కార్తీకమాసం చివరి శుక్రవారం పురస్కరించుకుని నిర్వహించిన లక్షపత్రి పూజలో తణుకు శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ దంపతులు పాల్గొన్నారు. ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను అన్నారు. మహిళలు పూజాకార్యక్రమంలో భారీగా పాల్గొని అనంతరం అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కారక్రమంలో దువ్వ జనసేన నాయకులు చిక్కాల వేణు గ్రామ కూటమి నాయకులు మరియు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.