శుక్రవారం తణుకు చైర్మన్ మరియు నాలుగవ అదనపు జిల్లాజడ్జి శ్రీమతి డి.సత్యవతి ఆకస్మికంగా తణుకు సబ్ జైల్ ను సందర్శించారు. ఈ సంధర్బంగా ముద్దాయిలకు అందుచున్న ఆహార వసతి వైద్యసదుపాయాల గురించి అడిగి తెలుసుకుని వారికి అందించు ఆహారాన్ని పరిశీలించారు. ముద్దాయిలను కేసుల వివరాలను అడిగి తెలుసుకుని న్యాయవాదిని పెట్టుకునే ఆర్థిక స్తోమతలేని వారికి ఉచితన్యాయ వాదిని ఏర్పాటు చేస్తామని, ది 14.12.2024 న కోర్టులో జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నారని, న్యాయవాదులు దానిలో కేసులు రాజీ చేసుకోవాలన్నారు. చెడుపనులకు దూరంగా ఉండాలి అని చెప్పారు. ఇందులో న్యాయవాదులు టి. సత్యనారాయణరాజు, ఎ. అజయ్ కుమార్, కుమారి మోతి సూపరింటెండెంట్ మోహనరావు పాల్గొన్నారు.