భారతదేశ మొట్టమొదటి సామాజిక ఉద్యమకారుడు జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు పాతవూరు వంతెన వద్ద వున్న మహాత్మా జ్యోతిరావు, సావిత్రిబాయి పూలే విగ్రహాల వద్ద పుష్పమాలలు వేసి ఘన నివాళులు సమర్పించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం నాయకులు వావిలాల సరళాదేవి, గుబ్బల శ్రీనివాస్, కడియాల సూర్య నారాయణ, గుమ్మళ్ళ హనుమంతు, తోట ఏసు, సి.పి.యం నాయకులు మురళి కుమార్, తామరాపు రమణమ్మ, చింతలపూడి సన్యాసిరావు, చుంచుల వెంకటేశ్వరరావు, తామరాపు పల్లపురావు, పద్మారావు, ఆకురాతి శ్రీనివాస్, బత్తుల వెంకటరమణ, తదితరులు ముందుగా పూలదండలతో, పుష్పాలతో ఆయనకు నివాళులు సమర్పించారు. ఈ సందర్భంగా తొలుతగా వావిలాల సరళాదేవి మాట్లాడుతూ జ్యోతిరావు పూలే ఔన్నత్యం గురించి, బి.సి.కులాల కోసం బడుగు వర్గాల అభ్యున్నతికి చేసిన కృషి వివరిస్తూ ఆనాటి ఆయన త్యాగ ఫలం ఈరోజు బిసీ లు నిమ్నజాతులవారు స్వేచ్ఛగా జీవించే హక్కును కలిగించారు. అదేబాటలో నేడు సిఎం చంద్రబాబునాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ బాబు బిసీ కులాలకు వెన్నుదన్ను వుండి బి.సి. లకు సంక్షేమ పథకాలతో పాటు గౌరవాన్ని కల్పిస్తున్న ఏకైక పార్టీ తేలుగదేశం పార్టీ అని తెలియపరిచినారు, అనంతరం టి.డి.పి నాయకులు గుబ్బల శ్రీనివాస్, కడియాల సూర్యనారాయణ, కౌరు వెంకటేశ్వరరావు, తాళ్లూరి మురళి తదితరులు పూలే జీవిత విశేషాలు, ఆయన చేసిన త్యాగాలు గురుంచి వివరించారు.
