చికెన్ వ్యర్ధాలు రవాణ చేస్తే కఠినచర్యలు

పెదపాడు ఎస్ఐ గారికి రాబడిన సమాచారం మేరకు వారి యొక్క సిబ్బందితో వాహన తనిఖీలు నిర్వహించగా AP 39 UU 3336 ఐషర్ ట్రక్కు లలో చికెన్ వ్యర్థాలను చేపల చెరువులకు సరఫరా చేస్తున్నటు వంటి వాహనము అదుపు లోనికి తీసుకుని డ్రైవర్ మరియు యజమానులపై చేపలచెరువుల యజమానులపై చర్యలు తీసుకుంటున్న పెదపాడు ఎస్సై కట్టా శారదా సతీష్. సదరు వాహన యజమానులపై డ్రైవర్ పై కేసులు నమోదు చేసి చికెన్ వ్యర్ధాలను ధ్వంసం చేసిన పెదపాడు ఇన్చార్జి ఎస్ఐ. ఈ మీడియా ప్రకటన ద్వారా తెలియచేసినారు. ప్రజల ఆరోగ్యానికి వాతావరణ కాలుష్యానికి కారణం అవుతున్న చికెన్ వ్యర్ధాల రవాణాను చేస్తున్న వారిపై కఠినచర్యలు తీసుకుంటున్నట్లు చికెన్ వ్యర్ధాలను రవాణా చేస్తున్న వారి యొక్క సమాచారాన్ని డయల్ 112 కు గాని పెదపాడు ఎస్ఐ ఫోన్ నెంబర్ 9440796637 కు సమాచారాన్ని అందించాలని సమాచారం అందించిన వారి యొక్క వివరాలను గోప్యంగా ఉంచుతామని ఈ మీడియా ప్రకటన ద్వారా పెదపాడు ఎస్ఐ కట్ట శారదా సతీష్ తెలియచేసినారు.

Scroll to Top
Share via
Copy link