నరసాపురం పార్లమెంట్ సభ్యులు, కేంద్ర మంత్రివర్యులు భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారి తండ్రి గారైన భూపతిరాజు సూర్యనారాయణరాజు ఇటీవల స్వర్గస్తులయ్యారు. ఈ సందర్భంగా భీమవరంలో కేంద్రమంత్రి ఇంటివద్ద శనివారం తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ దంపతులు వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించి, భూపతిరాజు శ్రీనివాస్ వర్మను, కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాడ సానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట టి.డి.పి. నాయకులు మల్లిన రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.