తణుకు పట్టణంలో బాలుర హైస్కూల్ నందు తణుకు శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ ముఖ్య అతిధిగా తల్లిదండ్రులు ఉపాధ్యాయులు సమన్వయ కమిటీ సమావేశం శనివారం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆరిమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ ఈరోజు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు సమన్వయ సమావేశం ఒక చక్కని వాతావరణంలో నిర్వహిస్తూ ఒకేరోజు రెండు పండుగలు అనగా షష్టి మరియు తల్లిదండ్రులు ఉపాధ్యాయ సమన్వయ సమావేశం చాలా సంతోషకరమని అన్నారు ఇలాంటి కార్యక్రమాన్ని రాష్ట్రంలో అన్ని పాఠశాలలో పెద్ద మొత్తంగా నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు నిర్వహిస్తున్నామని అన్నారు. తల్లిదండ్రులకి ఉపాధ్యాయులకి మధ్య పరిచయాలు ఏర్పరిచి మన పిల్లల భవిష్యత్తుని ఏ విధంగా తీర్చిదిద్దాలని వారిని ఎటువంటి మార్గంలో నడిపించాలనేదే యొక్క సమావేశం ముఖ్య ఉద్దేశమని అన్నారు. ముఖ్యంగా ఈ పేరెంట్స్ మీటింగ్ అనేది ఇంతవరకు లేదని ఇదే మొదటిసారి అని అన్నారు. ఇంతకుముందు విద్యార్థులకు ప్రోగ్రెస్ కార్డు ఇచ్చేవారని ఇప్పుడు దానితోపాటు వారికి హెల్త్ కార్డులు కూడా ఇవ్వడం జరుగుతుందని దానివల్ల మన పిల్లలు యొక్క ఆరోగ్య సమస్యల గురించి ఒక రికార్డు మైంటైన్ చేయొచ్చు అని అన్నారు. దాని వలన పిల్లలు స్టడీ ఎలా ఉన్నది వారి యొక్క ఆరోగ్య సమస్యలు ఎలా ఉన్నదని తల్లితండ్రులు తెలుస్తుందని ఈ సందర్భంగా అన్నారు. ముఖ్యంగా పిల్లల మీద ప్రభావం చూపించేది తల్లులే అని పిల్లలు తండ్రి మాట కన్నా తల్లి మాటే వింటారని అన్నారు. అందువలన ప్రతిరోజు పిల్లలతో తల్లులు కనీసం కొంచెం సమయం కేటాయించి వారితో మాట్లాడడం వలన పిల్లల భవిష్యత్తు బాగుంటుందని అన్నారు. పిల్లలు స్కూలుకు వెళ్లి తిరిగి వచ్చిన తర్వాత వెళ్లేటప్పుడు ఏం జరిగింది వచ్చేటప్పుడు కూడా ఏం జరిగినది అని పిల్లలను విషయాలు అడిగి తెలుసుకోవడం తల్లులు బాధ్యతని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివి ఎంతోమంది ఉన్నత స్థాయికి ఎదిగారని దానిలో భాగంగా నేను కూడా గవర్నమెంట్ హైస్కూల్లో చదివానని అన్నారు. ముఖ్యంగా ఆడపిల్లలు స్కూల్ నుంచి ఒక రోజు లేటుగా వస్తే చూడాలి అదే రెండో రోజు కూడా లేటుగా వస్తే ఎందుకు లేటుగా వచ్చావు అని నిలదీయ వలసిన బాధ్యత తల్లిదని అన్నారు. ఈరోజు సమాజంలో అతి ప్రమాదకరమైనది ఏమనగా ఉందంటే అది డ్రగ్స్ అని ఈరోజు సమాజంలో ప్రతి గ్రామములోనూ ప్రతి చోట గంజాయి విచ్చలవిడిగా దొరుకుతుందని పిల్లల్ని టార్గెట్ చేసి ఈ గంజాయి మాఫియా నడుస్తుందని ముఖ్యంగా స్కూల్ పిల్లలపై టార్గెట్ చేస్తున్నారని చాక్లెట్లో గంజాయి పెట్టి అమ్ముతున్నారని అది పిల్లలు తెలుసుకోవాలని అన్నారు. దానిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని గంజాయిపై ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, జీవితాలు పాడైపోతాయని ఈ సందర్భంగా తెలియపరిచినారు. అనంతరం డొక్కా సీతమ్మ భోజనశాల నందు పిల్లలతో కూర్చొని భోజనం చేసినారు. పిల్లలను భోజన ఏర్పాట్లు గురించి కూడా అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సిబ్బంది విద్యార్థినీ విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.