లేహ్యం ఫ్యాక్టరీ భాదితుల నిరశన

తణుకులో లెహ్యం ఫుడ్ ఫ్యాక్టరీ వలన సమీపంలో నివశిస్తున్నసమీప కాలనీ ప్రజలు తీవ్ర దుర్ఘందం, చంటిపిల్లలు, వృద్దులు, మహిళలు ఇబ్బందులు పడుతున్నారని, అదేవిదంగా పరిసర గ్రామప్రజలతో కలసి నిరశన ప్రదర్శన చేసారు. గొవులు, గేదేలు వధిస్తూ పరిసరాలను, భూగర్భ జలాలను కలుషితం చేస్తున్న లేహ్యం సంస్థ కార్యకలాపాలు వేంటనే నిలిపివేయాలని బాధితులు కొరారు. అనంతరం తహశీల్దార్ కార్యాలయంలో స్పందన కార్యక్రమంలో తహశీల్దార్ కి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా లెహ్యం ఫుడ్ ఫ్యాక్టరీకి అనుమతి లేదు. తక్షణమే మూసివేయాలి అని వినతిపత్రంలో పేర్కొన్న బాధితులు. అదేవిదంగా గో సంరక్షణ సమితి సభ్యులు, అనుమతుల విషయంలో సంబందిత అన్ని ప్రభుత్వ శాఖల అధికారులకు విజ్ణాపనలు ఇవ్వడంతో, తహశీల్దార్ మాట్లాడుతూ సమస్యపై పరిశీలించిన అనంతరం తగినచర్యలు తీసుకోవడం జరుతుందని చెప్పడంతో బాధితులు శాంతించారు.

Scroll to Top