పండగ వాతావరణం లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ల పంపిణీ
ఉమ్మడికూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకటవ తేదీ తెల్లవారకముందే పండుగ వాతావరణం మధ్య పింఛన్ల పంపిణీ చేయడంజరుగుతుందని తణుకు శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ తెలిపారు. ఈసందర్భంగా మంగళవారం తణుకు పట్టణం 14వ వార్డులో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారుల ఇంటి, ఇంటికి వెళ్లి పెన్షన్ డబ్బులు అందించారు. ఈ కార్యక్రమంలో తణుకు పట్టణ టి.డి.పి అధ్యక్షులు కలగర వెంకటకృష్ణ, ఉమ్మడి కూటమి టిడిఫి, జనసేన, బిజేపి నాయకులు పాల్గొన్నారు.