ఉండ్రాజవరం మండల పరిధిలో మోర్త గ్రామంలో ఎం.పి.పి.ఎస్.నెం.2 పాఠశాలకు లయన్స్ క్లబ్ పైడిపర్రు-తేతలి, సామాజిక సేవా సంస్థ ఉందుర్తి పాల్ ఫౌండేషన్ సంయుక్తంగా 4వేల రూపాయల విలువగల ఐడెంటిటీకార్డులు, దేశనాయకుల చిత్రపటాలను మంగళవారం విద్యార్థినీ విద్యార్థులకు ప్రెసిడెంట్ ఉందుర్తి ప్రసన్నకుమార్, పాల్ ఫౌండేషన్ సభ్యులు దున్నాఅమర్ బాబు, తలపాకులఅఖిల్ చేతులమీదుగా విద్యార్ధులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎస్.ఎల్.వి.ప్రసాదరావు, పాఠశాల ఉపాధ్యాయురాలు కె.బేబిలక్ష్మి పాల్గొన్నారు.