ద్విచక్ర వాహనదారులు ప్రయాణించు సమయంలో ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించి తీరాలని ఉండ్రాజవరం ఎస్సై శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా పాలంగి గ్రామంలో శుక్రవారం నిర్వహించిన స్పెషల్ డ్రైవ్ లో భాగంగా ద్విచక్ర వాహనదారులకు త్రిబుల్ రైడింగ్, వేగపరిమితి, హెల్మెట్ ధారణ, మైనర్లకు వాహనాలు ఇవ్వటం తీవ్రమైన ప్రమాదాలకు కారణాలు అవుతున్నాయని అవగాహన కల్పించారు. అదేవిధంగా డ్రైవింగ్ లైసెన్స్ ప్రతి వాహనానికి ఇన్సూరెన్స్ తప్పనిసరిగా ఉండాలని, వాహనానికి సంబంధించిన పత్రాలను వాహనదారుడు తన దగ్గర ఉంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హెచ్.సి. రామకృష్ణ, పిసి లు. ఎం. ముత్యాలరావు, వి. త్రినాథ్ పాల్గొన్నారు.