వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ మరియు CD NCD గుర్తింపు కార్యక్రమంలో భాగంగా శనివారం ఉండ్రాజవరం ప్రాధమిక ఆరోగ్యకేంద్రం పరిధిలో ఉన్న మోర్త-2 సచివాలయం, ఎంపియుపి స్కూల్ విద్యార్డులకు ఉండ్రాజవరం ప్రాధమిక ఆరోగ్యకేంద్రం వైధ్యాధికారిణి ఆర్.ఉషాదేవి స్క్రీనింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులందరికీ బరువు, ఎత్తు , రక్తహీనత నిర్ధారించే పరీక్షలు నిర్వహించారు. పరిసరాల శుభ్రత, వ్యక్తిగత శుభ్రతపై బాలబాలికలకు అవగాహన కల్పించి, అందరూ పోషకవిలువలు ఉన్న ఆహారాన్ని క్రమంతప్పకుండా తీసుకోవాలని, పోషకాహారం తినడం వలన ప్రతి విధ్యార్ధి, ఆరోగ్యంగా ఉండటంతో పాటు విద్యను అభ్యసించడానికి కావలిసిన శక్తి సామర్ధ్యాలు కలుగుతాయని డాక్టర్ ఆర్.ఉషాదేవి తెలిపారు. ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ ఎం. సుబ్రహ్మణ్యం, హెల్త్ అసిస్టెంట్ విజయ్ కుమార్, మహిళా ఆరోగ్యకర్త జ్ఞానేశ్వరి, ఎంఎల్హెచ్పి రోజా, ఆషా కార్యకర్తలు పాల్గొన్నారు.