జాతీయ గణిత దినోత్సవాన్ని ఉండ్రాజవరం మండలంలోని పాఠశాలల్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శనివారం ఉండ్రాజవరం జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమానికి బౌద్ధ ధమ్మ పీఠాధిపతి భంతే అనాలయో సుంకవల్లి ట్రస్ట్ డాక్టర్ సుంకవల్లి సూర్యనారాయణలు ముఖ్యఅతిధులుగా పాల్గొని ప్రసంగించారు. గణిత ఉపాధ్యాయులు ఆళ్ల సుబ్బారావు, దమయంతి, నూర్జహాన్ బేగం, నాగజ్యోతి, వెంకటేశ్వరరావు, పద్మజరాణి పాల్గొని వివిధ పోటీలలో విజేతలైన విద్యార్థులకు బహుమతి ప్రదానం చేశారు. గణిత శాస్త్రవేత్తగా శ్రీనివాస రామానుజం సేవలు, గణితం యొక్క ప్రాధాన్యత వివరించారు.