పల్నాడు, గుంటూరు,ప్రకాశం,బాపట్ల జిల్లాల పరిధిలోని నాగార్జునసాగర్ కుడి కాలువ ప్రాజెక్టు నూతన చైర్మన్ గా ఎన్నికైన పలుకూరి కాంతారావు ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో పాల్గొన్న 7 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, జిల్లా టిడిపి నేతలు.
జూలకంటి బ్రహ్మారెడ్డి కామెంట్స్..
కూటమి ప్రభుత్వంలో రైతు సంక్షేమ కోసం ముందుగా నీటి సంఘం ఎన్నికలు నిర్వహించడం జరిగింది.30 సంవత్సరాలుగా పార్టీ కోసం కృషి చేసిన కాంతారావు గారిని చైర్మన్ గా ఎన్నుకోవడం సంతోషం. 5 సంవత్సరాలుగా కాలువలో పూడికలు తీయలేని పరిస్థితుల్లో వైసీపీ ప్రభుత్వం ఉంటే,ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే కాలువలు రిపేర్లు చేయించడం జరిగింది. రాబోయే రోజుల్లో రైతు సంక్షేమ కోసం కోవపరేటివ్,మార్కేట్ వ్యవస్థలను బలోపేతం చేసే విధంగా ముందుకు వెళ్తాము. రైతు దీక్షలు పేరుతో వైసీపీ నాయకులు రోడ్లు ఎక్కడం సిగ్గు చేటు. 5లక్షల కోట్లు అప్పులు చేసి, కేవలం రూ.7వేల కోట్లు రైతుల కోసం ఉపయోగించకుండా జగన్ రైతులను మోసం చేసాడు. రైతులకు ఉన్న అన్ని పథకాలను నిర్వీర్యం చేసి రైతాంగాన్ని జగన్ మోసం చేసాడు. కేవలం బటన్ నొక్కుతున్నాం అంటూ ప్రజల పీకల నొక్కిన ఆనాటి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డికి
ప్రజలు బుద్ది చెప్పారని అన్నారు.