వినుకొండ రోడ్ లో ఉన్న జగనన్న కాలనీ భూములను రీ సర్వే చేయాలని ఆర్డీవో ఆదేశాలు ఈ సందర్భంగా శనివారం ఆర్డిఓ మధులత, ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు తహసిల్దార్ వేణుగోపాల్ జగనన్న కాలనీ భూములను పరిశీలించారు. కాలనీలో మొత్తం భూములను రీ సర్వే చేయాలని తాహసిల్దార్ కు, ఆర్డిఓ ఆదేశాలు ఇచ్చారు. వాగు పోరంబోకు భూములు ఏమైనా ఉంటే తక్షణమే వెనక్కి తీసుకోవాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వాగులు, చెరువు,కుంటలు భూములను ప్రభుత్వం వదిలేది లేదని ఆర్డీవో స్పష్టం చేశారు. ఆటోనగర్ ఏర్పాటు చేసే ప్రతిపాదన పై ఆలోచన చేస్తామని ఆర్డిఓ మధులత అన్నారు. శనివారం జగనన్న కాలనీ పరిశీలించి ఆర్డీవో మాట్లాడారు. శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద బాబు ఆటోనగర్ ను ఏర్పాటు చేసేందుకు తమకు ప్రతిపాదన చేయడం జరిగిందన్నారు. అన్ని ప్రభుత్వ నిబంధనలు, అవకాశాలు కచ్చితంగా పరిశీలించి చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.