ద్విచక్ర వాహనదారుల పెండింగ్లో ఉన్న చలానులను వెంటనే చెల్లించాలని వన్ టౌన్ సిఐ విజయ్ చరణ్ అన్నారు. శుక్రవారం పట్టణంలో ద్విచక్ర వాహనాల పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు వారం క్రితం నుంచి పట్టణంలో ద్విచక్ర వాహనాల పెండింగ్ చలానాలపై ప్రత్యేక తనిఖీలు చేయడం జరిగిందని అన్నారు. మున్సిపల్ ఆఫీస్ వద్ద స్పెషల్ డ్రైవ్ ను నిర్వహించామన్నారు. ద్విచక్ర వాహనం పట్టుకున్నప్పుడు పెనాల్టీ విధిస్తే ఫోన్ కు మెసేజ్ వస్తుందని అన్నారు. ఆ పెనాల్టీని పోలీస్ యాప్ ద్వారా గాని, మీ సేవ ద్వారా గాని చెల్లించవచ్చన్నారు. ఇటువంటి సందర్భాలలో ఫేక్ మెసేజ్ వచ్చి తమను ఇబ్బందులకు గురి చేయవచ్చని వివరించారు. ప్రజలందరూ ఫేక్ యాప్ ల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ స్పెషల్ డ్రైవ్ లో వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై వంశీకృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు.
