తణుకు ఆర్టీసీ గ్యారేజ్, ట్రాఫిక్ విభాగంలో ‘స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివస్’ క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రాం దృష్ట్యా శనివారం తణుకు డిపో బస్సు స్టాండ్ ఆవరణలో డిపో మేనేజర్ సప్పా గిరిదర్ కుమార్ ఆధ్వర్యంలో క్లీన్ & గ్రీన్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డిపో సిబ్బంది పాల్గొనీ డిపో పరిసరాలలో పిచ్చి మొక్కలను తొలగించి, పేరుకుపోయిన చెత్తను శుభ్రం చేశారు.
