దువ్వ కోలాట ఘటనలో నిందితులకు రిమాండ్

దువ్వ గ్రామంలో రాత్రి సుమారు 9 గంటల నుండి 9 గంటల 30 నిమిషాలు మధ్య కోలాటం ఆడుచున్న వ్యక్తులపై అదే గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు వచ్చి ఘర్షణపడి వారి మీద నేరపూరితంగా ప్రవర్తించడం జరిగింది ఈ సంఘటన జరిగిన వెంటనే తణుకు రూరల్ పోలీస్ వారు సంఘటన స్థలానికి చేరుకోవడం జరిగింది సదరు బాధితుడి నుండి ఫిర్యాదు తీసుకొని దానిని ఎఫ్ఐఆర్ నెంబర్ 40/25 క్రింద నమోదు చేయడం జరిగినది. సంఘటన జరిగిన వెంటనే పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ సంఘటన స్థలాన్ని పరిశీలించి ప్రత్యక్షంగా అన్ని వివరాలు తెలుసుకున్నారు. ఎస్పీ ఇచ్చిన సూచనల మేరకు వెంటనే రెండు టీంలు ఏర్పరచి సంఘటనకు కారణమైన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకునే ప్రత్యక్ష సాక్షులను విచారించి వారిని 07/02/2025 నాడు జైలుకు పంపడం జరిగినది.
మరియు గ్రామంలో పోలీస్ పికెట్టు ఏర్పాటు చేయడం జరిగినదిని తెలిపారు. గ్రామంలో ప్రశాంత పరిస్థితులను నెలకొల్పడం జరిగింది. కావున ప్రజలు భవిష్యత్తులో ఎటువంటి సంఘటనలు జరిగిన పోలీసు వారి దృష్టికి తీసుకు వచ్చినట్లయితే చట్ట ప్రకారం వారిపై ఎఫ్ఆర్ నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటాము కావున
ఎవరూ కూడా గొడవల్లో పాల్గొనవద్దని పోలీసు వారి తరఫున విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపారు.

Scroll to Top
Share via
Copy link