పల్నాడు జిల్లా మాచర్లలో జరిగిన హత్యకు సంబంధించి సాక్షిలో ప్రచురితమైన కథనానికి సాక్షి ఎడిటర్ ఆర్.ధనుంజయరెడ్డితోపాటు ఆరుగురు పాత్రికేయులపై క్రిమినల్ కేసులు నమోదచేయడాన్ని వ్యతిరేకిస్తూ తణుకు ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో శుక్రవారం తణుకు తహసిల్దారు కార్యాలయం వద్ద జర్నలిస్టులు నిరసన తెలిపారు. పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించవద్దని, అక్రమ కేసులను ఉపసంహరించుకోవాలని నినదించారు. ఈ సందర్భంగా ఏపీడబ్లు్యజే జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ తులా భాస్కర్ మాట్లాడుతూ సాక్షి ఎడిటర్ ధనుంజయరెడ్డి, మరొక 6గురు సాక్షి జర్నలిస్టులపై పోలీసులు కేసులు నమోదుచేయడం బాధాకరమని అన్నారు. జర్నలిస్టుల హక్కులను కాలరాసే విధంగా అక్రమ కేసులు నమోదుచేయడం శోచనీయమని, జర్నలిస్టులకు ఉన్న స్వేచ్ఛను అణగదొక్కే ఇలాంటి చర్యలను తక్షణమే ఉపసంహరించుకోవాలని కోరారు. పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించేవిధంగా నమోదుచేసిన అక్రమ కేసులను తక్షణమే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టుల భద్రతకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని స్పష్టం చేశారు. అనంతరం తహసిల్దారు దండు అశోక్‌వర్మకు తణుకు ప్రెస్‌క్లబ్ జర్నలిస్టులు వినతిపత్రం అందచేశారు. ఈ కార్యక్రమంలో ఏపీడబ్లు్యజే జిల్లా మాజీ సెక్రటరీ కొడమంచిలి కృష్ణ, ఏపీయూడబ్లు్యజే చిన్నపత్రికల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పమ్మి ఏడుకొండలు, తణుకు ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ అధ్యక్షులు బొండ రామ్‌కుమార్, పాత్రికేయులు తానేటి దొరబాబు, గజ్జరపు నారాయణమూర్తి, కొలగాని రాజా, పంజా శివ, వెలగల నారాయణరెడ్డి, చిల్లా రాజశేఖర్, గాదిరెడ్డి రామ్‌ప్రసాద్, రంబాల బద్రి, అమర రాజశేఖర్, సతీష్, , హరీష్, పెద్దిరాజు, సత్యప్రసాద్, డేగల మణి, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.
