ఉండ్రాజవరం మండలం మానవత నెలవారీ సమావేశం ఆదివారం కఠారి సిధార్ధరాజు అద్యక్షతన పాలంగి మానవత భవనము నందు జరిగినది. సదరు సమావేశములో ముఖ్యఅతిధులుగా పాలంగి వాస్తవ్యులు మానవతసంస్థకు విరాళము అందించిన దాతలు నెక్కంటి సుధాకర్, నామాల శివరామకృష్ణ విచ్చేశారు. ఈ సందర్భంగా పాలంగి మానవత సంస్థ తరుపున చిరుసత్కారం నిర్వహించారు. అదేవిదంగా సమావేశంలో 2025-26 సం.నకు నూతన కార్యవర్గ సభ్యులుగా ఉప్పలపాటి శ్రీనివాస్, అధ్యక్షులు, ఐసెట్టి విజయరాజు, సెక్రటరీ, మట్టపర్తి భువన కుమార్ ట్రెజర్ గా కమిటీ ఏర్పాటు చేయడమైనది. అనంతరం జిల్లా డైరీ ఆవిష్కరణ చేసి, మానవత సంస్థ ద్వారా చేపట్టవలసిన కార్యక్రమములు చర్చించి నిర్ణయం తీసుకున్నారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షులుగా కడలి మాణిక్యాలరావు వ్యవహరించారు.
