ఉండ్రాజవరం మండల టిడిపి అధ్యక్షుడిగా సింహాద్రి రామకృష్ణ ఎన్నికైనట్లు ఆదివారం జరిగిన తెలుగుదేశం పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో తెలిపారు. మండల టిడిపి అధ్యక్షునిగా నాలుగవసారి ఎంపిక కావడంతో మండలంలోని టిడిపి నాయకులు కార్యకర్తలు సింహాద్రి రామకృష్ణను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అభ్యున్నతికి చిత్తశుద్ధితో మరింత కృషి చేస్తానని, తనకు అభినందనలు తెలియజేసిన ప్రతి టిడిపి నాయకునికి కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేశారు.
