భారత్‌ శక్తిసామర్థ్యాలు ప్రపంచానికి తెలిశాయి

పాకిస్తాన్‌ దుశ్చర్యలు థీటుగా ఎదుర్కొంటున్న ఇండియన్‌ ఆర్మీ

వీరమరణం పొందిన మురళీనాయక్‌ కుటుంబానికి ప్రభుత్వం అండ

వెల్లడించిన తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ

మురళీనాయక్‌ మృతికి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే రాధాకృష్ణ

పాకిస్తాన్‌ ఉగ్రవాద సంస్థలపై పోరాడుతున్న భారత త్రివిధ దళాలకు దేశ ప్రజలంతా సంఘీభావం తెలిజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. పాకిస్తాన్‌తో చేస్తున్న యుద్ధంతో భారత్‌ శక్తిసామర్థ్యాలు ప్రపంచానికి చాటిచెప్పడంలో ఇండియన్‌ ఆర్మీ విజయం సాధించిందని చెప్పారు. శుక్రవారం తణుకులో ఆయన మీడియాతో మాట్లాడారు. పాకిస్తాన్‌ దుశ్చర్యలను ధీటుగా ఎదుర్కొంటున్న క్రమంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన మురళీ నాయక్‌ వీరమరణం పొందడం బాధాకరమన్నారు. మురళీ నాయక్‌ కుటుంబానికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారని గుర్తు చేశారు. భారతదేశంలో స్వయంగా అభివృద్ధి చేసిన ఆయుధాలతో పాకిస్తాన్‌ పాల్పడుతున్న దుశ్చర్యలను ధీటుగా ఎదుర్కొనడం గర్వకారణమన్నారు. ఇలాంటి యుద్ధం సమయంలో ఇండియన్‌ ఆర్మీకు సంఘీబావం తెలియజేస్తూ జవాన్లు క్షేమంగా ఉండాలని దేశానికి రక్షణ కల్పిస్తున్న వారందరికీ భగవంతుడు శక్తిని ఇవ్వాలని ఆయన ఆకాంక్షించారు. గతం నుంచి పాకిస్తాన్‌ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నప్పటికీ ప్రధాన మంత్రి నరేంద్రమోదీ సమన్వయం ప్రదర్శించి సమర్థవంతంగా శక్తిసామర్ధ్యాలు ప్రదర్శించేలా శత్రుదేశాలను ధీటుగా ఎదుర్కోవడంలో విజయం సాధించారని చెప్పారు. ప్రపంచ దేశాలు సైతం భారత దేశానికి సంఘీభావం తెలియజేయడం అభినందనీయమని ఎమ్మెల్యే రాధాకృష్ణ పేర్కొన్నారు.

Scroll to Top
Share via
Copy link