వేసవిలో నీటి వనరులను కాపాడుకునేందుకు చర్యలు
తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పిలుపు
తణుకు 6, 7 వార్డు స్వర్ణాంధ్ర -స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలు
చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపుమేరకు స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర 2047 లక్ష్యానికి అనుగుణంగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపుమేరకు వికసిత్ భారత్ కార్యక్రమాల్లో భాగంగా ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల్లో ప్రజలు భాగస్వాములు కావాలని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పిలుపునిచ్చారు. వేసవిలో నీటి వనరులను కాపాడుకునే లక్ష్యంతో చేపట్టిన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా తణుకు పట్టణంలోని 6, 7 వార్డుల్లో శనివారం నిర్వహించిన కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. ఆరో వార్డులో చెరువులో పేర్కొన్న తూడును డ్రోన్ సాంకేతిక పరిజ్ఞానంతో మందు పిచికారి చేయడం జరిగిందని చెప్పారు. అంతేకాకుండా చెరువు చుట్టూ రిటైనింగ్ వాల్, వాకింగ్ ట్రాక్ నిర్మించడానికి ప్రణాళికలు చేస్తున్నట్లు చెప్పారు. ముఖ్యంగా పారిద్ధ్యాన్ని, పరిశుభ్రతను పెంచే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన స్ఫూర్తితో ప్రతి ఒక్కరు స్వర్ణాంధ్ర -స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి సహకరించాలని కోరారు. గ్రామాల్లో పట్టణాల్లో నెలలో ప్రతి మూడో శనివారం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించే ప్రజలను భాగస్వాములను చేయాలని కోరారు. జిల్లా నోడల్ అధికారి సూర్య కుమారి మాట్లాడుతూ స్థానికంగా ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఇస్తున్న స్ఫూర్తితో ప్రజలంతా సహకరించి స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి ఇంట్లో మహిళ తడి చెత్తను సేకరించి కంపోస్టు తయారు చేసుకోవడం ద్వారా ఎంతో మేలు జరుగుతుందని చెప్పారు. చెరువులు, పంట కాలవల్లో వ్యర్ధాలు వేయకుండా ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. కేవలం మూడో శనివారం మాత్రమే కాకుండా ప్రతిరోజు పారిశుద్ధ్యం, పరిశుభ్రతపై దృష్టి సారించాలని సూచించారు. స్వచ్ఛ ఆంధ్ర సాధనకు కృషి చేయాలని కోరుతూ ప్రతిజ్ఞ చేయించారు. అంతకుముందు రోడ్లు పక్కన చిరు వ్యాపారాలు చేసుకునే వ్యాపారులకు గుర్తింపు కార్డులు అందజేశారు. పారిశుద్ధ్య కార్మికులను సత్కరించి వారి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి, తాడేపల్లిగూడెం ఆర్డిఓ భానో, తణుకు మున్సిపల్ కమిషనర్ టి.రామ్ కుమార్, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.