దీపావళి మందుల అమ్మకాలకు ముందు జాగ్రత్త చర్యలు

ఉండ్రాజవరం పోలీస్ స్టేషను పరిధిలో దీపావళి సందర్భంగా చట్టానికి వ్యతిరేకంగా ఎవరైనా అనుమతి లేకుండా బాణసంచా/టపాసులను ఇళ్లల్లో, షాపులలో, జన సముదాయాల మధ్య గోడౌన్‌లలో స్టాకు అనుమతి లేకుండా నిల్వలు చేసిన లేదా లైసెన్సు లేకుండా అనధికార విక్రయాలు జరిపిన బాణాసంచా విక్రయించే దుకాణదారులు పోలీసు, అగ్నిమాపక, రెవెన్యూ అధికారులు సూచించిన నియమ నిబంధనలను తప్పని సరిగా పాటించకపోయినా లైసెన్స్ కలిగిన వారు దీపావళి సామాగ్రి విక్రయించే ప్రదేశాల్లో ఫైర్ సేఫ్టీ కచ్చితంగా పాటించాలని ఎవరైనా లైసెన్స్ లేకుండా విక్రయించిన చట్టాన్ని గౌరవించకుండా ఉల్లంఘించిన అటువంటి వారిపై చట్టపరంగా జిల్లా ఎస్పీ, డి.ఎస్.పి. ఆదేశాలతో కఠిన చర్యలు తీసుకుంటామని ఉండ్రాజవరం సబ్ ఇన్స్పెక్టర్ జి. శ్రీనివాసరావు చెప్పడం జరిగింది. అదేవిధంగా దీపావళి సందర్భంగా ఉండ్రాజవరం పోలీస్ స్టేషన్ పరిధిలో తాత్కాలిక లైసెన్స్ కొరకు అప్లై చేసుకున్న వ్యాపారస్తులకు సూచనలు ఇవ్వడం జరిగిందనీ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఉండ్రాజవరం తెలియజేశారు.

Scroll to Top
Share via
Copy link