జగనన్న కాలనీల పేరుతో ప్రజలను మోసం చేసిన వైసిపి

కాలనీలో సౌకర్యాలు కల్పించకపోవడంతో ప్రజలకు ఇబ్బందులు

తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ విమర్శలు

ఇరగవరం మండలంలో కొనసాగుతున్న సుపరిపాలనలో తొలి అడుగ

గత వైసిపి ప్రభుత్వం హయాంలో జగనన్న కాలనీల పేరుతో సెంటు స్థలంలో కట్టించి ఇచ్చిన కాలనీలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆరోపించారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా గురువారం అయినపర్రు, ఓగిడి గ్రామాల్లో ఎమ్మెల్యే రాధాకృష్ణ పర్యటించి గత ఏడాదికాలంగా అందుతున్న సంక్షేమం అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జగనన్న కాలనీలలో కనీస సౌకర్యాలు కల్పించకుండా ఇరుకు రోడ్డులో డ్రైనేజీలు, రోడ్లు నిర్మించకుండా నిర్లక్ష్యం చేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. చాలామంది ప్రజలు సెంటు భూమిలో ఇల్లు కట్టుకోలేని పరిస్థితుల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. మోకాళ్ళ లోతు మురికి నీళ్లలో స్థలాలు ఇవ్వడంతో ఒక ఇల్లు కూడా నిర్మాణం చేయలేని పరిస్థితి ఉందని అన్నారు. మోసకారి సంక్షేమాన్ని అమలు చేసి సెంటు భూమిలో ఎందుకు పనికిరాని స్థలంలో ప్రజలు ఇల్లు ఎలా నిర్మించుకుంటారని ప్రశ్నించారు.అంత దారుణమైన పరిస్థితిని కల్పించారు కాబట్టే వైసీపీ ప్రభుత్వాన్ని ప్రజలు ఓడించి బుద్ధి చెప్పారని అన్నారు. అభివృద్ధి, సంక్షేమాన్ని అమలు చేస్తూ ఎక్కడికి వెళ్లినా కూటమి ప్రభుత్వం పట్ల ప్రజలు వ్యక్తం చేస్తున్నారని అన్నారు. రాబోయే రోజుల్లో గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు, పట్టణ పరిధిలో రెండు సెంట్లు ఇళ్లస్థలాలు ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని అన్నారు.ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link