స్కూల్ బస్సు ప్రమాద విద్యార్థులను పరామర్శించిన ఎమ్మెల్యే రాధాకృష్ణ
స్కూల్ బస్సులు ఫిట్ నెస్ లేకుండా నడిపితే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ హెచ్చరించారు. ప్రైవేటు స్కూల్ యాజమాన్యాలు దీన్ని బాధ్యతగా తీసుకొని నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. ఇరగవరం మండలంలో గురువారం జరిగిన స్కూలు బస్సు ప్రమాదంలో గాయపడి తణుకు ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను ఎమ్మెల్యే రాధాకృష్ణ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బస్సులో ప్రమాద సమయంలో 25 మంది విద్యార్థులు ప్రయాణిస్తున్నారని అయితే అదృష్టవశాత్తు ఎవరికి గాయాలు కాలేదన్నారు. స్కూలు బస్సు డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని అన్నారు. స్కూలు బస్సు డ్రైవర్లు ప్రవర్తన వ్యవహార శైలిపై యాజమాన్యాలు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలని కోరారు. చాలామంది బస్సు డ్రైవర్లు ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. శాఖా పరంగా అధికారులు స్కూల్ బస్సు నిర్వాహణపై నిరంతరం పర్యవేక్షించాలని కోరారు. మరోసారి ప్రమాదాలు పునారావృతం కాకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే రాధాకృష్ణ కోరారు.