జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ పోటీలు ప్రారంభం
తణుకులో ప్రారంభించిన ఎమ్మెల్యే రాధాకృష్ణ
తణుకులో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారులను తయారు చేసే విధంగా సౌకర్యాలను కల్పించడం అభినందనీయమని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. హైదరాబాదు తర్వాత తణుకులోనే పుల్లెల గోపీచంద్ అకాడమీను అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ముందు చూపుతో చిట్టూరి సుబ్బారావు ఏర్పాటు చేయడం హర్షించదగిన విషయమన్నారు. తణుకు ఎస్‌కేఎస్‌డీ మహిళా కళాశాలలో చిట్టూరి సుబ్బారావు అండ్ గోపిచంద్ బ్యాండ్మింటన్ అకాడమీలో జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ పోటీలను శుక్రవారం ఎమ్మెల్యే రాధాకృష్ణ ప్రారంభించి మాట్లాడారు. చిట్టూరి సుబ్బారావు స్థాపించిన అకాడమీతో క్రీడల పట్ల ఆయనకు ఉన్న మక్కువ అలాంటిదన్నారు. పోరాడి గెలవాలనే లక్ష్యంతో క్రీడాకారులు ముందుకు వెళ్లాలని కోరారు. భవిష్యత్తులో ఈ వేదిక నుంచి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని కోరారు. కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ చిట్టూరి సత్య ఉషారాణి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా అసోసియేషన్ కార్యదర్శి మెంటే వంశీకృష్ణ, గ్రూపు కళాశాలల జాయింట్ సెక్రటరీ చిట్టూరి వెంకట కృష్ణారావు, అసోసియేషన్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కంటిపూడి రాంబాబు, ఆర్గనైజింగ్ సెక్రటరీ సమ్మెట్ల సతీష్‌బాబు, కళాశాల పీడీ రత్నకుమాఇ, అకాడమీ కోచ్ యు.సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.