నిడదవోలు నియోజకవర్గం ఉండ్రాజవరం మండలం చివటం గ్రామంలో ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్ & మాజీ శాసనసభ్యులు మరియు నిడదవోలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ శ్రీ బూరుగుపల్లి శేషారావు ఆధ్వర్యంలో జరిగిన “సుపరిపాలనలో తొలి అడుగు” కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రివర్యులు గొట్టిపాటి రవి కుమార్ మరియు APIIC చైర్మన్ మంతెన రామరాజు. ఈ కార్యక్రమం లో నిడదవోలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మండల, గ్రామ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గోన్నారు. సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమంలో భాగంగా ఉండ్రాజవరం మండలం చివటం గ్రామంలో పాల్గొన్న రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్. కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా కూటమి ప్రభుత్వం నెరవేర్చిన హామీలు పట్ల ప్రజల స్పందన ఏ విధంగా ఉందనేది ప్రతి ఇంటికి వెళ్లి తెలుగుదేశం పార్టీ ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు పాల్గొని అభిప్రాయం సేకరించడం ద్వారా ప్రజల స్పందన సమస్యలు ప్రభుత్వానికి చేరవేత లక్ష్యంగా సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం. ఈ సందర్భంగా నిడదవోలు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బూరుగుపల్లి శేషారావు, ఏపీ ఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు పాల్గొని చివటం గ్రామంలో లబ్ధిదారులను అందిస్తున్న పథకాల వివరాలను స్పందనను స్వయంగా తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటితో గ్రామస్తులు తమ గ్రామంలో డంపింగ్ యార్డ్ సమస్య, కాలనీలో విద్యుత్ స్తంభాల ఏర్పాటు, సూపర్ సిక్స్ లో అమలవుతున్న ఉచితb గ్యాస్ సిలిండర్ కొంతమందికి అందడం లేదని ప్రస్తావించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ వేముల వెంకట సత్యనారాయణ, గ్రామ టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
