తణుకు ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో ట్రాన్స్పోర్ట్ ఆఫీసులు, గోడౌన్లలో తనిఖీలు

తణుకు ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో శనివారం తణుకు పట్టణంలో పలు ట్రాన్స్పోర్ట్ ఆఫీసులు గోడౌన్లతోపాటు ఏపీఎస్ఆర్టీసీ కార్గో సర్వీస్ గోడౌన్లను తనిఖీలు నిర్వహించి అక్కడ పని చేసే సిబ్బందికి తగు సూచనలు ఇవ్వడం జరిగింది. ప్రొహిబిషన్ చట్టము మరియు ఎక్సైజ్ చట్టం , ఎన్ డి పి ఎస్ చట్టం పరిధిలోకి వచ్చే ఆల్కహాలు, నాటు సారాయి, గంజాయి, ఇతర డ్రగ్స్ తదితర వాటిని రవాణా చేయుటకు అనుమతిస్తే చర్యలు తప్పవని సూచించడంతోపాటు అటువంటి పదార్థాలను గుర్తించినట్లయితే వెంటనే తమ దృష్టికి తీసుకొని రావాలని తణుకు ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఎస్. మణికంఠ రెడ్డి తెలియజేశారు.

Scroll to Top
Share via
Copy link