ఉండ్రాజవరం ప్రాధమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ముందస్తు క్యాన్సర్ స్క్రీనింగ్ (3.0 )

ముందస్తు క్యాన్సర్ స్క్రీనింగ్ (3.0 )లో బాగంగాఉండ్రాజవరం ప్రాధమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఉన్న నెంబర్ 1 స్కూల్ నందు ఉన్న పిల్లలతో క్యాన్సర్ పైన అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బాగంగా వైధ్యాధికారి డాక్టర్ ఆర్‌ఎస్‌ఎస్‌వి ప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ ముందస్తు క్యాన్సర్ స్క్రీనింగ్ వల్ల ఎవరైనా క్యాన్సర్ లక్షణాలతో బాధపడుతున్నట్లు అయితే, ఈ స్క్రీనింగ్ వల్ల అటువంటి వారిని గుర్తించి తగిన పరీక్షలు నిర్వహించి వారిని క్యాన్సర్ బారిన పడకుండా కాపాడడానికి ఒక మంచి అవకాశం అని తెలియజేశారు. రెండవ వైద్యాధికారిణి డాక్టర్ ఆర్.ఉషా దేవి మాట్లాడుతూ ఈ స్క్రీనింగ్ కార్యక్రమము ఈ నెల 14.11.2024 నుండి మండలం లో ఉన్న అన్నీ స్కూల్స్ నందు ప్రతి విద్యార్డులను క్యాన్సర్ స్క్రీనింగ్ చేయడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల కమ్మ్యూనీటి హెల్త్ ఆఫీసర్ ఎం. సుబ్రహ్మణ్యం, పబ్లిక్ హెల్త్ నర్స్ కే‌డి‌వి‌ఎల్ కుమారి, ఆరోగ్య పర్యవేక్షకులు జీన్నురి శ్రీను, కె .నాగమణి, ఎం‌ఎల్‌హెచ్‌పి లు, ఆరోగ్య సిబ్బంది , ఆషా కార్యకర్తలు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link