సీనియర్ జర్నలిస్ట్ డా.నేమాలకు
ఆత్మీయ అభినందన సత్కారం
విశాఖపట్నం: ఆగస్టు 7 (కోస్టల్ న్యూస్)
జిల్లా బీజేపీ చేనేత సెల్ అధ్యక్షుడు తెడ్లపు అప్పారావు ఆధ్వర్యంలో పార్టీ జిల్లా కార్యాలయంలో 11వ అంతర్జాతీయ చేనేత దినోత్సవ వేడుకలు గురువారం సాయంత్రం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంనకు ముఖ్య అతిథులుగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఏపీ అసెంబ్లీ బీజేపీ ఫ్లోర్ లీడర్ ఉత్తర నియోజకవర్గం శాసనసభ్యుడు పి.విష్ణుకుమార్ రాజు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాశి విశ్వనాథరాజు విశాఖ జిల్లా పార్టీ అధ్యక్షులు పరశురామ్ రాజు సీనియర్ నాయకులు
నీలాపు విజయానంద రెడ్డి ఎస్వీఎస్ ప్రకాష్ రెడ్డి బుద్ధ లక్ష్మీనారాయణ కొప్పల రామ్ కుమార్, దిలీప్ వర్మ ఇతర నేతలు హాజరయ్యారు.
కార్యక్రమంలో భాగంగా నగరానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్
డా.నేమాల హేమసుందరరావును అతిథులచే దుశ్శాలువాతో ఘనంగా సత్కరించి అభినందించారు.
ఈ సందర్భంగా హేమసుందర్ మాట్లాడుతూ ముందుగా అతిథులకు కార్యక్రమానికి హాజరైన బీజేపీ నాయకులు కార్యకర్తలు చేనేత సామాజిక వర్గానికి చెందిన పెద్దలకు
సభ్యులకు 11వ అంతర్జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
చేనేత సామాజిక వర్గానికి చెందిన తాను సామాజిక సేవా దృక్పథంతో
1995లో పాత్రికేయ రంగంలో అడుగుపెట్టి 30 ఏళ్లుగా నిస్వార్థ సేవలను అందిస్తున్నట్లు తెలిపారు.
తన సేవలను గుర్తించి పార్టీ ప్రముఖులచే సత్కరించిన జిల్లా బీజేపీ చేనేత విభాగం నాయకులకు
సభ్యులకు పార్టీ నేతలకు కృతఙ్ఞతలు తెలిపారు.