మొదటి రోజు 35 ఓవర్ల ఆట మినహా మిగతా రోజుల ఆట తుడిచిపెట్టుకుపోయిన భారత్–బంగ్లాల (India-Bangladesh 2nd test) రెండో టెస్ట్మ్యాచ్లో నాలుగో రోజు మాత్రమే ఆట మళ్లీ సాధ్యమైంది. మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లా, తొలిరోజు స్కోరు 107/3 ను కొనసాగించి, 233 పరుగులకు ఆలౌట్ కాగా, భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌ను సునామీలా మార్చింది. టి20 మ్యాచ్(T20 match)లా రెచ్చిపోయిన భారత బ్యాటర్లు 3 ఓవర్లలో 50 పరుగులు, 10 ఓవర్లలో 100 పరుగులు చేసారు. భారత్ తమ మొదటి ఇన్నింగ్స్‌ను 34.4 ఓవర్ల వద్ద 9 వికెట్లకు 285 పరుగుల వద్ద డిక్లేర్ ( 285/9 Dec in 34.4 overs)చేసింది. మొత్తంగా 8.22 రన్ రేట్‌తో భారత్ ఈ టెస్ట్ ఇన్నింగ్స్ ఆడింది. ఈ క్రమంలో ఇండియా నమోదు చేసిన రికార్డులను చూద్దాం.
టెస్ట్ మ్యాచ్‌లో అత్యతం వేగవంతమైన 50, 100, 150, 200 పరుగులు చేసిన జట్టుగా భారత్ రికార్డు నెలకొల్పింది. ఇవన్నీ కూడా ఒకే మ్యాచ్‌లో, ఒకే ఇన్నింగ్స్‌లో నమోదవడం గమనార్హం.