రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ఆదేశాలతో తాడిమల్ల గ్రామంలో అగ్ని ప్రమాదానికి గురై ఇళ్లు కోల్పోయిన దిరుసుమిల్లి నాగేశ్వరరావు కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున నిత్యావసర వస్తువులు, వ్యక్తిగతంగా రూ.10 వేల ఆర్థిక సాయం అందజేత గొప్ప మనసు చాటుకున్న మంత్రి దుర్గేష్ అంటూ ఆనందం వ్యక్తం చేసిన బాధిత కుటుంబం మంత్రి కందుల దుర్గేష్ అందించిన ఆర్థిక సాయం వెలకట్టలేనిదంటూ పేర్కొన్న బాధిత కుటుంబం నిడదవోలు రూరల్ మండలం తాడిమల్ల గ్రామంలో అగ్ని ప్రమాదానికి గురై ఇళ్లు కోల్పోయిన దిరుసుమిల్లి నాగేశ్వర రావు కుటుంబానికి రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ఆదేశాలతో ఎమ్మార్వో నాగరాజు నాయక్, స్థానిక కూటమి నాయకుల చేతుల మీదుగా రాష్ట్ర ప్రభుత్వం తరపున నిత్యావసర వస్తువులు, వ్యక్తిగతంగా రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయం అందజేశారు. నిత్యావసర వస్తువుల్లో భాగంగా 25 కేజీల బియ్యం, 1 కిలో కందిపప్పు, 1 కిలో బంగాళ దుంపలు, 1 కిలో ఉల్లిపాయలు, 1 కేజీ ఆయిల్ ప్యాకెట్ పంపిణీ చేశారు. అగ్ని ప్రమాదానికి పూర్తిగా ఇళ్లు దగ్దమైందని ఈ కష్ట కష్టకాలంలో మంత్రి కందుల దుర్గేష్ గొప్ప మనసు చాటుకొని తమ కుటుంబానికి భరోసానిచ్చారని, ఆయన అందించిన ఆర్థిక సాయం వెలకట్టలేనిదని బాధిత దిరుసుమిల్లి నాగేశ్వర రావు కుటుంబం ఆనందం వ్యక్తం చేసింది. దుర్గేష్ లాంటి నాయకుడు కల్పించిన భరోసాతో ధైర్యంగా ముందుకు సాగుతామన్నారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మార్వో నాగరాజు నాయక్, జనసేన పార్టీ మండల అధ్యక్షులు పోలిరెడ్డి వెంకటరత్నం, గ్రామ జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు.