తణుకు వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీ చిట్టూరి ఇంద్రయ్య మెమోరియల్ కళాశాలలో జిమ్ ను వాకర్స్ సభ్యులు గురువారం శ్రమదానం చేసి శుభ్రం పరచినారు. ఈ సందర్భంగా వాకర్స్ సభ్యులు బసవా రామకృష్ణ మాట్లాడుతూ ఆరోగ్యమే మహా భాగ్యం అని, పరిశుభ్రత కూడా ఆరోగ్యానికి అంతే అవసరం అన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు బసవ రామ కృష్ణ, ట్రెజరర్ చిక్కాల సత్యనారాయణ, సభ్యులు యలమర్తి రాజేంద్ర బాబు, అడ్డాల నారాయణ, శివాజీ, మణికంఠ, గాదె సూరి బాబు, మహిళా వాకర్స్ పాల్గొన్నారు.
