భారతదేశానికి అత్యున్నత రాజ్యాంగాన్ని అందించిన అంబేద్కర్ గొప్ప దార్శనికుడని ఆల్ ఇండియా పూలే అంబేడ్కర్ ఫౌండేషన్ జాతీయ అధ్యక్షులు న్యాయవాది పొట్ల సురేష్ అన్నారు. అంబేద్కర్ 68 వ వర్ధంతి సందర్భంగా శుక్రవారం తణుకు జూనియర్ కాలేజీలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈసందర్బంగా సురేష్ మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి మతతత్వ పాలనతో రాజ్యాంగానికి తీవ్ర ముప్పు ఏర్పడిందన్నారు. సమాజాన్ని ముక్కలుగా చీల్చి, సామాజిక అసమానతలకు పునాదులు వేసే మనుస్మృతి అమలుకు బిజెపి పూనుకుంటుందన్నారు. రాజ్యాంగ ప్రజాస్వామ్య, లౌకిక వ్యవస్ధ పరిరక్షణకు ప్రతీఒక్కరూ కృషి చేయడం ద్వారా అంబేద్కర్ ఆశయ సాధనకు పూనుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి విద్యార్థులు కాలేజీ యాజమాన్యం తదితరులు పాల్గొన్నారు.