తణుకులో నూతన జి.వి.మాల్ ప్రారంభించిన మీనాక్షి చౌదరి

వస్త్ర ప్రపంచంలో 75 సంవత్సరాల సుదీర్ఘ అనుభవంతో ఖమ్మం గుడివాడ, రాజమండ్రి మిర్యాలగూడ, కొత్తగూడెం, ఏలూరు సత్తుపల్లి, జంగారెడ్డిగూడెం, బీ, కోదాడ, నంద్యాల కర్నూలు, తాడేపల్లిగూడెం, అమలాపురం, నిడదవోలు, మణుగూరు లలో సంస్థలు స్థాపించి ఖాతాదారుల నుండి విశేషమైన ఆదరాభిమానాలు పొందుతూ నిర్వహించబడుతున్న ప్రసిద్ధ వస్త్ర సంస్థ జీవీ మాల్ నేడు తణుకులో అద్భుతమైన నూతన షోరూమ్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రముఖ సినీ తార మీనాక్షి చౌదరి నూతన షోరూమ్ ను ప్రారంభించి మాట్లాడారు, జీవి మాల్ నాణ్యతకు విస్తారమైన రేంజ్ కు కాంపిటేటివ్ ధరలను అందిస్తుందని అన్నారు. అపరమితమైన కలెక్షన్స్ అద్భుతమైన మోడల్స్ అత్యంత అందుబాటు ధరలతో అందించడం జీవి మాల్ యాజమాన్యానికే సాధ్యమని మీనాక్షి చౌదరి అన్నారు. ఈ సందర్భంగా జీవి మాల్ ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న స్థానిక శాసనసభ్యులు ఆరెమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ తణుకు ప్రాంతంలో జీ.వి.మాల్ లాంటి అధునాతనమైన వస్త్ర షో రూములు మరిన్ని రావాలని, వ్యాపార పరంగా తణుకు ప్రాంతం మరింత అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో షోరూం అధినేతలు సుమంత్, స్థానిక పట్టణ ప్రముఖులు పరిమి వెంకన్న బాబు, దొమ్మేటీ వెంకట సుధాకర్, గమిని రాంబాబు, మంత్రి రావు వెంకటరత్నం, తమరాపు సత్యనారాయణ, బట్ట వెళ్లి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా జివి మాల్ యాజమాన్యం మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మరియు కర్ణాటక రాష్ట్రాలలో లక్షలమంది హృదయాలను గెలుచుకున్న జీవి మాల్ నేడు తణుకులో సరికొత్త స్టోర్ ప్రారంభిస్తున్నామని మొత్తం కుటుంబం కోసం అత్యుత్తమ అంతర్జాతీయ ఫ్యాషన్ స్టైలిష్ అరుదైన డిజైన్లతో ఇంటిల్లిపాదికి ఆహ్వానం పలుకుతున్నామని తెలిపారు.

Scroll to Top