యుటిఎఫ్ వారి ఎస్.ఎస్.సి స్టడీ మెటీరియల్ ను, ఉండ్రాజవరం హైస్కూల్ లో 160 మంది కి పైగా విద్యార్థులకు ఉచితంగా సుమారు 15 వేల రూపాయల మెటీరియల్ ను 10వ తరగతి చదువుతున్న అందరికీ పంపిణీ చేయడంమైనది. ఈవిధంగా ఆర్థికంగా సహకరించిన యివ్వల రాంబాబు మాష్టారును, పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ కె.ఎస్.కె.మాణిక్యాలరావు అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం 10వ, తరగతి విద్యార్థులకు, ఎన్.ఎం.ఎం.ఎస్,8వ, తరగతి విద్యార్థులకు, ఇంటర్ మీడియట్ విద్యార్థులకు, ఉచితంగా స్టడీ మెటీరియల్ అందిస్తున్న రాంబాబు మాష్టారు అభినందనీయులని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ఉపాధ్యాయులు, నిరీక్షణ రాజు, లక్ష్మీ నారాయణ, ఉదయ్ భాస్కర్, దుర్గా ప్రసాద్, శేషేంద్ర మొదలైన ఉపాధ్యాయులు పాల్గొన్నారు.