2018, 21_22 సంవత్సరంలో కురిసిన భారీవర్షాలకు ఎర్రకాలువకు వచ్చిన వరద ఉధృతికి తాడేపల్లిగూడెం నియోజకవర్గం పరిధిలో ఎర్ర కాలువకు 19చోట్ల పడిన గండ్లు వలన తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో పట్టీ పాలెం, వీరంపాలెం, అప్పారావుపేట, మాధవరం, జగ్గన్నాధపురం, ఆరుళ్ళ, నందమూరు , గ్రామాలు పొలాలు మునిగి రైతులు పూర్తిగా నష్టపోవడం జరిగింది దీనిపై రాష్ట్ర ప్రభుత్వ విప్ మరియు తాడేపల్లిగూడెం నియోజకవర్గం శాసనసభ్యులు అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడి సభ దృష్టికి తీసుకువెళ్లగా శాశ్వతంగా ప్రతి ప్రాదికంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని కోరడం జరిగిందన్నారు. ఇరిగేషన్ డివిజన్ ఏలూరు వారి ద్వారా 9.99 కోట్లు రూపాయలను 24 పనులకు ప్రతిపాదనలు సమర్పించగా శుక్రవారం కలెక్టరేట్ జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో ప్రభుత్వ విప్ మరియు తాడేపల్లిగూడెం నియోజకవర్గం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి కి నివేదికను అందజేశారు. ఈ సందర్భంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టీ రాహుల్ కుమార్ రెడ్డి ఉన్నారు.