జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్బముగా సోమవారం ఉండ్రాజవరం మల్లిన జిల్లాపరిషత్ హైస్కూల్ యందు మరియు Mpp స్కూల్ నందు ఉన్న AWW సెంటర్ నందు కోడ్ నెంబర్ 130 లో ఉండ్రాజవరం ప్రాధమిక ఆరోగ్యకేంద్రం వైధ్యాధికారి ఆర్.ఎస్.ఎస్.వి. ప్రసాద్, డాక్టర్ ఆర్. ఉషాదేవి ఆద్వర్యంలో స్కూల్ లోని పిల్లలందరికి నులిపురుగు మాత్రలు మింగించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బాగంగా ముందుగా పిల్లలందరి చేతులను పరిశుబ్రముగా కడిగించిన తర్వాత, బోజనము చేసిన 15 నిమిషములు ఆగి మాత్రలు మింగించడం జరిగింది. పిల్లలందరికి అల్బెండజోల్ మాత్రలు యొక్క ఉపయోగాలు తెలియజేశారు. ఈ మాత్రలు వేసుకోవడం వలన కడుపులో ఉన్న నులిపురుగులు చనిపోయి, రక్తహీనత నుండి విముక్తి పొందవచ్చు అని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కమ్మునిటీ హెల్త్ ఆఫీసర్ ఎం.సుబ్రహ్మణ్యం, ఆరోగ్య సిబ్బంది, ఆశ కార్యకర్తలు, అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు.
