- సినీ హీరో కంచర్ల ఉపేంద్రబాబు
అమర గాయకులు ఘంటసాల గీతాలు అనితర సాధ్యమని సినీ హీరో కంచర్ల ఉపేంద్ర బాబు అన్నారు. గాన గంధర్వుడు ఘంటసాల 51 వ వర్ధంతి సందర్భంగా మంగళవారం ఉదయం ఆర్కే బీచ్ రోడ్డు లో ఘంటసాల స్పోర్ట్స్ అండ్ కల్టీరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘంటసాల విగ్రహానికి పాలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈసందర్భంగా హీరో ఉపేంద్ర బాబు మాట్లాడుతూ గాయకుడిగా, సినీ సంగీత దర్శకుడిగా సినీ రంగానికి సేవలందించిన ఘంటసాల క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని 18 నెలలు జైలు జీవితం అనుభవించిన దేశ భక్తుడు ఘంటసాల అని కొనియాడారు. సినీ నిర్మాత, ఉపకార్ ట్రస్ట్ చైర్మన్ డా. కంచర్ల అచ్యుతరావు మాట్లాడుతూ తెలుగు సాహిత్యానికి తన పాత ద్వారా గౌరవం తెచ్చిన మహా గాయకుడు ఘంటసాల అని కీర్తించారు. ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త భాస్కర భట్ల సత్య ప్రసాద్ శర్మ మాట్లాడుతూ అన్ని వర్గాల వారి హృదయాల్లో చెరగని ముద్ర గా నిలిచిన ఘంటసాల అన్నితరాలకు ఆదర్శ ప్రాయులన్నారు. ఘంటసాల స్పోర్ట్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్ వ్యవస్థాపక కార్యదర్శి చెన్నా తిరుమలరావు అధ్యక్షత వహించిన సభలో వివిధ కళా సంస్థల ప్రతినిధులు బొమ్మిడి సత్యనారాయణ, మధుపాడ రమణి, ఇందిరా సాహిణి, పోలీస్ నరసింగ్, కెఎస్ ప్రకాష్, వై. నాగేంద్రమ్మ, ఏలూరు లక్ష్మి, ఉపకార్ ట్రస్ట్ ఇంచార్జ్ సుధీర్, వివి చారి, రామకృష్ణ తదితరులు హాజరైన ఘంటసాల విగ్రహానికి పూలమాలలు వేసి ఘంటసాల సేవల్ని కొనియాడారు.