విశ్వవిద్యాలయాల స్వయం ప్రతిపత్తిని పరిరక్షించాలని, యూనివర్సిటీలో రాజకీయ జోక్యం నిషేధించాలని , ప్రైయివేటు విశ్వవిద్యాలయాల రాకను వ్యతిరేకించాలని , ఢిల్లీలో ఉన్న జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ నందు సస్పెన్షన్ కు గురి అయిన 17 మంది విద్యార్థులపై సస్పెన్షన్ ఎత్తివేయాలని ఈ రోజు . ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (ఐసా) జాతీయ కమిటి పిలుపులో భాగంగా తాడేపల్లిగూడెం నందు ఉన్న నన్నయ్య యూనివర్సిటీ సబ్ సెంటర్ వద్ద విద్యార్థులతో కలిసి . ఏ ఐ యస్ ఏ . ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టినారు ఈ సందర్భంగా ఐసా జిల్లా కార్యదర్శి టి అప్పలస్వామి మాట్లాడుతూ విశ్వవిద్యాలయాల స్వయంప్రతిపత్తిని పరిరక్షించాలని విశ్వవిద్యాలయాల్లో వీసీ నియామకాలులో రాష్ట్రాల హక్కులను కాలరాసేటట్లు ప్రయత్నాలు జరుగుతున్నాయని దీనిపై దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయని వారు తెలిపారు ఈ ఆందోళనలో ఐసా అగ్రభాగాన నిలిచి పోరు సాగిస్తుందని వారన్నారు రాజ్యాంగ విలువలను ఈరోజు ప్రభుత్వాలు హరిస్తున్నాయని వాటిలో భాగంగానే ఉన్నత విద్యను పూర్తిస్థాయిలో ప్రైవేటీకరణ చేసేందుకు చట్టాలను సవరిస్తున్నారని వారు ధ్వజమెత్తారు ప్రైవేట్ విశ్వవిద్యాలయాలకు ప్రభుత్వాలు రెడ్ కార్పెట్ వేస్తున్నాయని ఇది చాలా దుర్మార్గమైన చర్య అని వారు విమర్శించారు విశ్వవిద్యాలయాలకు అధిక నిధులు కేటాయించి అక్కడ మౌలిక వసతులు మెరుగుపరచాలని , విశ్వవిద్యాలయాల్లోఖాళీగా ఉన్న ఆచార్య పోస్టులు భర్తీ చేయాలని వారు డిమాండ్ చేశారు అదేవిధంగా ఢిల్లీలో ఉన్న జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీలో సస్పెన్షన్ కు గురి అయిన 17 మంది విద్యార్థులపై తక్షణమే సస్పెన్షన్ ఎత్తివేయాలని వారు డిమాండ్ చేశారు లేనిచో వామపక్ష విద్యార్థి సంఘాల ఐక్య కార్యచరణగా దేశ వ్యాప్త నిరసన కార్యక్రమాలు చేపడతామని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో బి సౌజన్య , డి దేవి , ఎం మానస , జ్ఞానేంద్ర , ఏ ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు
