విశాఖ ఉమ్మడి జిల్లా బీసీ సంఘం అధ్యక్షులు బోగి రమణ
బీసీల న్యాయమైన డిమాండ్స్ సాధన కోసం తలపెట్టిన చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విశాఖ ఉమ్మడి జిల్లా బీసీ సంఘం అధ్యక్షులు బోగి రమణ చెప్పారు. జాతీయ బి.సి. సంక్షేమ సంఘం, ఆంధ్రప్రదేశ్ బి.సి. సంఘం సంయుక్త ఆధ్వర్యలో బీసిల డిమాండ్స్ కోసం ఈ నెల 12, 13 తేదీల్లో ఛలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టినట్టు ప్రకటించారు. డాబాగార్డెన్స్ లోని విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో
చలో ఢిల్లీ పోస్టర్ ను బీసీ నేతలు ఆవిష్కరించారు. ఈ సందర్బంగా రమణ మాట్లాడుతూ పార్లమెంట్ లో బీసీ బిల్లు పెట్టాలని డిమాండ్ చేశారు. ఓబీసీ లకు 50 శాతం రాజకీయ రిజర్వే షన్ కల్పించాలని, బీసీ మహిళల కు రిజర్వేషన్ కల్పిస్తూ బిల్లు పెట్టాలన్నారు. కేంద్రంలో ఓబీసీలకు మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలన్నారు. బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లు లో రిజర్వేషన్ కల్పించాలని కోరారు. ప్రధాని నరేంద్ర మోడీ బీసీలకు పెద్ద పీట వేశారని, ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ బీసీల పట్ల వారి డిమాండ్స్ పట్ల సానుకూలంగా వున్నారన్నారు. బీసీ ఉద్యమ నేత పితాని ప్రసాద్ మాట్లాడుతూ బీసీ డిమాండ్స్ పై న్యూఢిల్లీలో సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. జాతీయ బి.సి. సంక్షేమ సంఘం అధ్యక్షులు రాజ్య సభ సభ్యులు ఆర్ కృష్ణయ్య పిలుపు మేరకు మార్చి 12న ఢిల్లీలోని ఆంధ్రా భవన్లో బీసీ మేధావుల రౌండ్ టేబుల్ సమావేశం, రెండో రోజున బీసీ మహిళా రిజర్వేషన్ బిల్లుపై సదస్సు ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు వీటితో పాటు బీసీ జనగణన, చట్ట సభల్లో రిజర్వేషన్ కల్పించాలని బీసీలకు క్రిమిలేయర్ విధానాన్ని రద్దు చేయాలి విజ్ఞప్తి చేశారు. ఏఐసీసీ సభ్యులు జి ఎ నారాయణరావు మాట్లాడుతూ బోగి రమణ బీసీ సమస్యలపై రాజీ లేని పోరాటం చేస్తున్నారని కొనియాడారు. చలో ఢిల్లీ కార్యక్రమం విజయవంతం అవుతుందన్నారు. ఆర్థికాభివృద్ధి సాధించి నప్పుడే బీసీలు అభివృద్ధి సాధించినట్టు అని పేర్కొన్నారు. బీసీలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నా బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదన్నారు. బీసీల ఆశలు, అశయాలు అక్కడే చచ్చిపోతు న్నాయిని ఆవేదన వ్యక్తం చేశారు.వీటికి పరిష్కారం చూపాలన్నారు. మీడియా సమావేశం లో వావిలపల్లి శ్యామ్ సుందర్ నాయుడు, రమేష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.