ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాలనీలలో ప్రజల సమస్యలను పరిష్కరించాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి జుత్తిగా గోపాలన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజాచైతన్య సైకిల్ యాత్రలో భాగంగా మంగళవారం ఇరగవరంమండలంలోని ఓగిడి, కొత్తపాడు ఇరగవరం ఎర్రయ్యచెరువు గ్రామాల్లోని కాలనీ యాత్ర బృందావనం పర్యటించి అక్కడ ప్రజలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా గోపాలన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేద మధ్యతరగతి కుటుంబాలకు రాష్ట్రం ప్రభుతం ఇచ్చిన ఇళ్లస్థలాలు, ఇళ్ల నిర్మాణాలులో కనీస సౌకర్యాలు అనగా రోడ్ల నిర్మాణము, డ్రైనేజీ, కరెంటు, మంచినీటి సౌకర్యాలు లేక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు .ప్రభుత్వము నిధులు కేటాయించాలని సమస్యలు పరిష్కారానికి కృషి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం కోసం ఈనెల 17వ తేదీన చలో కలెక్టరేట్ నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజలు అప్పులు చేసి ఇల్లు నిర్మించుకోవడం వల్ల ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని అన్నారు. ప్రభుత్వము ప్రకటించిన నిధులు కూడా లబ్ధిదారులకు సకాలంలో అందడం లేదని గోపాల్ అని అన్నారు. ఎన్నికల ముందు కూటమి ఓటమి ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు కామన మునిస్వామి, పార్టీసభ్యులు ఇల్లందుపర్తి సత్యనారాయణ, ఈ.ముసలయ్య, డి నాగబాబు, పాల సత్యనారాయణ, జుత్తిగా రామాంజనేయులు, పిల్లి కోటీశ్వరావు, పేచ్చేటి నాగేశ్వరరావు పాల్గొన్నారు.
