రూ. 23.18 కోట్ల పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు – నియోజకవర్గంలో పర్యటించిన రాష్ట్ర, కేంద్ర మంత్రులు
తణుకు నియోజకవర్గంలో అభివృద్ధి పరుగులు తీసే విధంగా స్థానిక ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ గురువారం శ్రీకారం చుట్టారు. తణుకు పట్టణంతోపాటు తణుకు, ఇరగవరం మండలాల్లో సుమారు రూ. 23.18 కోట్లు విలువైన అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, రోడ్లు భవనాలు శాఖ మంత్రి బీసీ జనార్థన్‌రెడ్డి, ఏపీఐఐసీ ఛైర్మన్ మంతెన రామరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ సహకారంతో రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమాన్ని ముందుకు తీసికెళుతూ సుపరిపాలన అందిస్తున్నారని చెప్పారు. తణుకు మున్సిపల్ సాధారణ నిధులతోపాటు రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం, ఆర్అండ్బీ నిధులతో రోడ్లు నిర్మాణం, సబ్స్టేషణ్ వర్గోన్నతి, సీఎస్ఆర్ నిధులతో వాకింగ్ ట్రాక్ నిర్మాణం, గ్రం««థాలయ భవనం ప్రారంభోత్సవం చేపట్టామన్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు మేరకు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. ఈ కార్యక్రమాల్లో తణుకు నియోజకవర్గంలోని కూటమి నాయకులు, కార్యకర్తలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
అభివృద్ధి కార్యక్రమాలు ఇలా…
– రూ. 32.20 లక్షల నిధులతో 34వ వార్డులోని సంజయ్ గాంధీ నగర్‌లోని సీసీ రోడ్లు నిర్మాణం
– రూ. 20 లక్షల నిధులతో 29, 30 వార్డుల్లో సీసీ రోడ్డు నుంచి రైల్వే ఫీడర్ రోడ్డు వరకు రోడ్డు నిర్మాణం
– రూ. 18.40 లక్షలతో 28వ వార్డులోని సుంకర వారి వీధి, కొమ్మన వారి వీధిలో సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణం
– రూ. 30 లక్షల సీఎస్ఆర్ నిధులతో చిట్టూరి ఇంద్రయ్య ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో వాకింగ్ ట్రాక్ నిర్మాణం
– 25వ వార్డు బ్యాంకు కాలనీలో రూ. 1.03 కోట్లతో నిర్మించిన నూతన గ్రం«థాలయ భవనం ప్రారంభం
– 12, 13 వార్డుల్లో రూ. 1.60 కోట్లుతో వివిధ సీసీ రోడ్లు నిర్మాణం
– రూ. 3.80 కోట్లుతో ఇరగవరం మండలం కె.ఇల్లిందలపర్రులో కొమరవరం–తూర్పువిప్పర్రు ఆర్అండ్బీ రోడ్డు నిర్మాణం
– ఇరగవరం మండలం ఏలేటిపాడు గ్రామంలో రూ. కోటి నిధులతో మార్టేరు–పక్కిలంక ఆర్అండ్బీ రోడ్డు నిర్మాణం
– ఇరగవరం మండలం అయినపర్రు గ్రామంలో రూ. 4.90 కోట్లుతో అయితంపూడి–కొత్తపాడు ఆర్అండ్బీ రోడ్డు నిర్మాణం
– తణుకు మండలం వేల్పూరు గ్రామంలో రూ. 6.80 కోట్లుతో తణుకు–వేల్పూరు ఆర్అండ్బీ రోడ్డు నిర్మాణం
– తణుకు మండలం వేల్పూరు గ్రామంలో రూ. 1.30 కోట్లుతో విద్యుత్ సబ్‌స్టేషన్‌లోని ట్రాన్స్ఫార్మర్ల వర్గోన్నతి
– తణుకు మండలం వేల్పూరు గ్రామంలోని రూ. 25 లక్షలతో అగ్గిరాయిచెరువు వాకింగ్ ట్రాక్ నిర్మాణం
– తణుకు మండలం వేల్పూరు గ్రామంలో రూ. 60 లక్షలతో విష్ణుప్రియ నగర్‌లోని సీసీ రోడ్డు నిర్మాణం, ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.